
పిల్లలు అంటేనే అల్లరి.. ప్రశ్న, పోట్లాట.. మారాం చేయడం. ఆ వయసులో తమకేది కావాలో క్లారిటీతో ఉంటారు. నచ్చింది ఇవ్వకుంటే మారాం చేయడం సహజం. వాళ్లు అడిగినవి అన్నీ ఇవ్వకపోయినా.. అందుబాటులో ఉన్నవి.. సాధ్యమైన కోరికలు తీర్చి బుజ్జగిస్తుంటారు పేరెంట్స్.
కానీ ఇక్కడ ఒక తల్లి.. పిల్లలు మారాం చేస్తున్నారని చపాతీ రోలర్ తో కొట్టింది. దీంతో బాబు చనిపోగా, పాప గాయాలపాలైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘార్ లో ఆదివారం (సెప్టెంబర్ 28) చోటు చేసుకుంది.
నాన్ వెజ్ అడిగారనీ..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కాశీపాద ఏరియాలో నివసిస్తున్న పల్లవి ఘుమ్డే (40).. ఆమె కొడుకు చిన్మయ్ గనేష్ (7) ను చపాతి కర్రతో కొట్టడంతో అప్పటికప్పుడే చనిపోయాడు. పదేండ్ల కూతురు తీవ్ర గాయాలతో బయటపడింది.
ఆదివారం కావడంతో పిల్లలు కామన్ గా అడిగినట్లే.. నాన్ వెజ్ కావాలని కోరారు. అయితే వెజ్ కర్రీనే వడ్డించడంతో.. నాన్ వెజ్ కావాలనికొడుకు చిన్మయ్ మారాం చేశాడు. తినమంటే తినకుండా.. నాన్ వెజ్ లేకుంటే తినమని కూర్చున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి పల్లవి.. చపాతీ కర్రతో చిన్మయ్ ను విచక్షణా రహితంగా కొట్టింది.
►ALSO READ | కన్నతల్లే కాల సర్పం అయ్యింది.. జనవరిలో ఒక కొడుకు.. ఇప్పుడు మరో కొడుకు హత్య.. మహబూబాబాద్ జిల్లాలో..
అదే కర్రతో కూతుర్ని కూడా దారుణంగా కొట్టింది. ఈ ఘటనలో కొడుకు చిన్మయ్ అక్కడిక్కడే చనిపోగా.. కూతరు గాయాల పాలైంది. పెద్దగా అరుపులు, శబ్దాలు వస్తుండటంతో ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి చూసే సరికి.. పిల్లలు పడిపోయి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాబు చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. పాపకు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి మహిళను అరెస్టు చేశారు. మారాం చేస్తున్నారని పిల్లలను చావబాదడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.