పలాస ప్యాసింజర్ రైలు ప్రమాదం జరిగింది ఇలా.. కారణాలు ఇవీ..

పలాస ప్యాసింజర్ రైలు ప్రమాదం జరిగింది ఇలా.. కారణాలు ఇవీ..

మొదట పలాస ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అందులోని ఓ బోగీ.. పల్టీలు కొట్టి.. మెయిన్ లైన్ లోని రైలు ట్రాక్ పై పడింది.ఆ లైన్ లో వేగంగా వస్తున్న గూడ్స్ రైలు.. మెయిన్ లైన్ పై పడిన పలాస ప్యాసింజర్ బోగీని వేగంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పి.. పలాస ప్యాసింజర్ రైలుపై పడింది.గూడ్స్ రైలు వేగంగా ఢీకొనటంతో.. పలాస ప్యాసింజర్ రైలు బోగీలు.. నాలుగు ఒక దానిపై ఒకటి ఢీకొని.. పక్కకు పల్టీలు కొట్టాయి. 

ఈ ప్రమాదం ముగ్గురు చనిపోయారు.. కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పలాస ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన తర్వాత.. చాలా మంది ప్రయాణికులు కిందకు దిగేయటంతో... మరణాలు సంఖ్య చాలా తగ్గింది.. లేకపోతే తీవ్రత ఎక్కువగా ఉండేదని అంచనా వేస్తున్నారు.ప్రమాదం తర్వాత విద్యుత్ స్థంబాలు విరగటం.. విద్యుత్ వైర్లు తెగిపోవటంతో కరెంట్ కట్ అయ్యింది. దీంతో ప్రమాదం స్థలంలో చీకట్లు ఉన్నాయి.