
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని టీఎన్ఎం ఆర్టికల్స్పష్టం చేస్తోందంటూ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి చెప్పారు. శుక్రవారం ఆయన లింక్డ్ ఇన్ లో స్పందించారు. పొలిటికల్లీడర్లకు, ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు కల్పతరువులా మారిందన్నారు. అన్నింటికీ ప్రాజెక్టు డబ్బే వాడుతున్నారని సుస్పష్టం అవుతోందన్నారు. ప్రపంచంలోనే కాళేశ్వరం అత్యంత పనికి మాలిన ప్రాజెక్ట్ అని విమర్శించారు. ఐఏఎస్ బిడ్డ పెండ్లికి మేఘా దావత్ అనే ‘వెలుగు’ పేపర్ క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేశారు.