యాదాద్రి, వెలుగు: చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ‘త్రెడ్ పోచంపల్లి’ పేరుతో హైదరాబాద్‌లోని హెటెక్స్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉన్నప్పటికీ.. మార్కెటింగ్‌లో వెనుకబడడంతో చేనేత కళాకారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో చేయూతనిచ్చేందుకు హైటెక్స్‌లో వచ్చే నెల 5 నుంచి 7 వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక్కత్ వస్త్రాల ప్రదర్శన కోసం వంద స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం 20 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. పోచంపల్లి గ్రామాన్ని టూరిజం కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
