రూ.82 కోట్లతో పెద్దపల్లిలో బైపాస్‌‌‌‌‌‌‌‌... శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు

రూ.82 కోట్లతో పెద్దపల్లిలో బైపాస్‌‌‌‌‌‌‌‌... శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పట్టణంలో రూ.82కోట్లతో 12.1కి.మీ మేర బైపాస్​ రోడ్డు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. శనివారం బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి పట్టణానికి బైపాస్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. 

పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుంచి నిట్టూరు, చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు 12 కిలోమీటర్ల మేరకు డబుల్ లేన్‌‌‌‌‌‌‌‌ రోడ్డుతోపాటు సెంట్రల్ లైటింగ్‌‌‌‌‌‌‌‌తో ఈ బైపాస్ నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్అండ్​బీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్​ నాయకులు తదితరులున్నారు.