24 మంది మావోయిస్టుల లొంగుబాటు

24 మంది మావోయిస్టుల  లొంగుబాటు

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీఎల్జీఏ ప్లాటూన్ నంబర్ 2 డిప్యూటీ కమాండర్ రాకేశ్ లొంగిపోయిన వారిలో ఉండగా, ఇతనిపై రూ.10 లక్షల రివార్డు ఉంది. మొత్తం వీరందరిపై రూ.87 లక్షల రివార్డు ఉంది. 

సీఆర్పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఐజీ రాకేశ్ కుమార్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, ఏఎస్పీ మయాంక్ గుజుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు.  ఒక్కో మావోయిస్టుకు తక్షణ సాయం కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందజేశారు.