హైదరాబాద్, వెలుగు: రాబోయే నేషనల్ అండర్–-14 సబ్-జూనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ నుంచి సత్తా చాటడానికి 24 మంది యువ ఫెన్సర్లు అర్హత సాధించారు. తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ (టీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని డెక్కన్ ఫెన్సింగ్ క్లబ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన స్టేట్ లెవెల్ సెలెక్షన్ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 83 మంది ఫెన్సర్లు పాల్గొన్నారు.
ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 24 మంది స్టేట్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్ నవంబర్ 3వ తేదీ నుంచి మణిపూర్‌లో జరగనున్న నేషనల్ ఫెన్సింగ్ టోర్నీలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనుందని టీఎఫ్‌ఏ జనరల్ సెక్రటరీ వై. శ్రీనివాసరావు తెలిపారు. యువ ఫెన్సర్లను టీఎఫ్‌ఏ వైస్ ప్రెసిడెంట్ డీఎస్ కుమార్, జాయింట్ సెక్రటరీ సందీప్ జాదవ్‌తో కలిసి అభినందించారు.
