మహారాష్ట్రలో ఎక్కువ ధరకు రేషన్ బియ్యం అమ్మకం

మహారాష్ట్రలో ఎక్కువ ధరకు రేషన్ బియ్యం అమ్మకం
  • 300 క్వింటాళ్లు స్వాధీనం చేసుకుని సీజ్ 
  • ఒకరిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు

కరీంనగర్ క్రైం,వెలుగు : కరీంనగర్ జిల్లాలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలం  దుబ్బ పల్లిలో గ్రామానికి చెందిన కర్రె గంగారం సమీప గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం  కొనుగోలు చేసి ఇంట్లో దాచాడు. 

సమాచారం మేరకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభించాయి. మహారాష్ట్రకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతుండగా.. ప్రతి నెలా లారీలో తరలిస్తున్నట్టు, నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని సీజ్ చేసినట్టు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.