చిలీ, అర్జెంటీనాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదు

చిలీ, అర్జెంటీనాలో భూకంపం.. రిక్టర్  స్కేలుపై 7.4 తీవ్రత నమోదు

సాంటియాగో: చిలీ, అర్జెంటీనా దక్షిణ తీరప్రాంతాల్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్  స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదయింది. అయితే, ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భూకంపం నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా చిలీలోని మాగెల్లాన్  జలసంధి ప్రాంతంలోని తీరం నుంచి ఖాళీచేసి వెళ్లిపోవాలని అధికారులు ప్రజలకు అలర్ట్  జారీ చేశారు. సునామీ కూడా వచ్చే ప్రమాదం ఉందని, సేఫ్​ జోన్‌కు వెళ్లిపోవాలని సూచించారు. ఇక అర్జెంటీనాలోని ఉషుయా సిటీలో కూడా భూకంపం వచ్చింది. ఈ భూకంపంలోనూ ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు.