
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో అడిషనల్ కలెక్టర్ఆర్వెంకట్రెడ్డి గురువారం ఆకస్మిక పర్యటన చేశారు. తహసీల్దార్కార్యాలయంలో రికార్డులను పరీశీలించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి భోజనం చేస్తున్న విద్యార్థుల మెనూను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వంట గదిని పరీశీలించి కూరలు క్వాలీటీ ఉండేలా చూడాలన్నారు. తక్షణమే ఆర్వో వాటర్ ప్లాంట్ పెట్టేలా కృషి చేయాలన్నారు.
ములుకనూర్లోని పిహెచ్సి ని సందర్శించి నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా అవగాహన కల్గించాలన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న యోగా కేంద్రంలో ఇన్స్ర్టక్టర్ విధులకు డుమ్మా కొడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని నిర్లక్ష్యం వహిస్తున్న యోగా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు.సమావేశంలో తహశీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.