
- కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత కోసం ప్రభుత్వం ఎంప్లాయిమెంట్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం స్థానిక ఎస్టీయూ భవన్లో తెలంగాణ ప్రభుత్వ టాస్క్ స్టేట్ఆర్గనైజేషన్, జిల్లా ఎంప్లాయిమెంట్శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. కలెక్టర్మాట్లాడుతూ.. ప్రైవేటు రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.
యువత నైపుణ్యం పెంపొందించుకొని అత్యున్నత వేతనాలు పొందే ఉద్యోగాలను దక్కించుకోవచ్చన్నారు. మెగా జాబ్ మేళాలో 34 ఎమ్ఎన్సీ కంపెనీలు హాజరవగా దీనికి 3,580 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో 296 యువతీ, యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా ఉపాధికల్పనాధికారి మిల్కా, మున్సిపల్ కమీషనర్ సీవీఎన్.రాజు, డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, డీఐఈఓ గణేశ్ జాదవ్, ఇండస్ట్రియల్ అధికారి నాగభూషనమ్, తదితరులు పాల్గొన్నారు.