ఎయిమ్స్ లో ఉద్యోగాల జాతర : మొత్తం 1484 పోస్టులు.. జస్ట్ 10th పాసైన చాలు..

 ఎయిమ్స్ లో ఉద్యోగాల జాతర : మొత్తం 1484 పోస్టులు.. జస్ట్ 10th పాసైన చాలు..

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్--–5 (సీఆర్ఈ–5)  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 28 ఎయిమ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న నాన్ -ఫ్యాకల్టీ గ్రూప్–బీ, గ్రూప్–సీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

 మొత్తం ఖాళీలు: 1484. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా, 12వ తరగతి, పదో తరగతి పూర్తిచేసి ఉండాలి. దాదాపు 57 గ్రూపుల్లో పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. 

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 11.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు  మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: జూన్ 30. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: జులై 25 –27.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.aiimsexams.ac.inను సంప్రదించండి.