నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

తమ నాలుగేళ్ల పరిపాలనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘దేవుడి ద‌య‌, మీ అంద‌రి చ‌ల్లని దీవెన‌ల‌తో నాలుగేళ్ల క్రితం మ‌న ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవ‌కాశంగా భావించి, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను మ‌న ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమ‌లు చేశాం. మ‌రోసారి మీకు సేవ చేసే అవ‌కాశం ల‌భించేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం’’ అంటూ సీఎం వైఎస్ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 

https://twitter.com/ysjagan/status/1660999830255333376