అంగన్వాడీల జీతాలు వెంటనే పెంచాలి : కరుణ కుమారి

అంగన్వాడీల జీతాలు వెంటనే పెంచాలి : కరుణ కుమారి
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
  • అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కరుణ కుమారి

మంచిర్యాల, వెలుగు: అంగన్వాడీల జీతాలు రూ.18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి డిమాండ్ చేశారు. మంచిర్యాలలోని సీపీఐ ఆఫీస్​లో జరిగిన మీటింగ్​లో ఆమె పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు తీర్చకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే రూ.18 వేల వేతనం చెల్లించాలన్నారు. 

టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షల రిటైర్​మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సూపర్​వైజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అనంతరం యూనియన్ జిల్లా కమిటీని ఎన్నుకు న్నారు. గౌరవ అధ్యక్షుడిగా కళిందర్ అలీఖాన్, అధ్యక్షుడిగా భూపతిరావు రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్​గా పి,సురేఖ, ఉపాధ్యక్షులుగా ఇందిర, అపర్ణ, శంకరమ్మ, పద్మావతి, సంధ్య, ప్రధాన కార్యదర్శిగా తోకల సరస్వతి, సహాయ కార్యదర్శులుగా రత్న రాజమణి, బి.శారద, ఐత అరుణ, శైలజ, నేరెళ్ల అరుణ, కోశాధికారిగా వై.కుసుమతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.