AP: ఉద్యోగ సంఘాలను మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం
V6 Velugu Posted on Jan 27, 2022
అమరావతి: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు రమ్మంటూ మరోసారి ఆహ్వానించింది. సచివాలయంలో మధ్యాహనం 12 గంటలకు సమయం నుంచి సమయం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరపున సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆహ్వానం పంపారు. తాజా చర్చలపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందించలేదు. నిన్న ఆహ్వానించగా మూడు ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తేనే చర్చలకు ఆహ్వానిస్తామని తేల్చి చెప్పారు. అన్ని విషయాలు చర్చించుకుని మంచి నిర్ణయం తీసుకుందామంటూ ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానించారు.
Tagged AP, Amaravati, PRC, go, employees unions