అర్జున్‌ రెడ్డిని మించేలా యానిమల్ కొత్త సాంగ్.. ఆ నరుకుడేంది సామీ!

అర్జున్‌ రెడ్డిని మించేలా యానిమల్ కొత్త సాంగ్.. ఆ నరుకుడేంది సామీ!

అర్జున్‌ రెడ్డి(Arjun reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor), నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) జంటగా వస్తున్న ఈ సినిమా.. డిసెంబర్‌ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజ‌ర్‌,  సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి అర్జన్ వాయ్లీ అనే సాంగ్ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో చూపించిన విజువల్స్ ఒక్కొక్కటి నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. గొడ్డలి చేతపట్టిన రణ్బీర్ ఒక్కొక్కరినీ నరుకుతుంటే.. మామూలు హై రాలేదు. జస్ట్ లోరికల్ వీడియోలోనే ఈ రేంజ్ విజువల్స్ అండ్ వైలెన్స్ ఉందంటే.. ఇక మొత్తం సినిమా ఎలా ఉండబోతుందా అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక ఈ పాటలో హీరో లుక్, యాటిట్యూడ్ చూస్తుంటే.. సందీప్ ఇంకా అర్జున్ రెడ్డి మత్తు నుంచి బయటకు రానట్టుగా కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే డిసెంబర్ 1న థియేటర్స్ బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో బీభత్సము సృష్టిస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.