ఆర్మూర్, వెలుగు : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవరాం, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్, ఏరియా అధ్యక్షుడు డి.నిఖిల్ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. బుధవారం ఆర్మూర్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
మొండి వైఖరి అవలంబిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ నెల 28, 29న కామారెడ్డిలో జరగనున్న పీడీఎస్యూ 23వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు, సహాయ కార్యదర్శి సిద్దు, ఏరియా నాయకులు వివేక్, వినయ్ , వెంకట్, అఫ్జల్, విద్యార్థులు పాల్గొన్నారు.
బోధన్ లోని మహాసభ కరపత్రం ఆవిష్కరణ
బోధన్ : ఈనెల 28, 29 తేదీల్లో కామారెడ్డిలో నిర్వహించే పీడీఎస్యూ మహాసభ కరపత్రాలను పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఆర్.గౌతమ్ ఆవిష్కరించి మాట్లాడారు. మొదటి రోజు ర్యాలీ, రెండో రోజు సభ ఉంటుందని తెలిపారు. ముఖ్య వక్తలుగా పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు వి.సంధ్య, ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ మాజీ రిజిస్త్రార్ వినాయక రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.సరిత, న్యాయవాది జి.రమేశ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎన్.దాసు పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె. సాయినాథ్, బలరాం , బాలకృష్ణ, సామెల్, అర్జున్, అరవింద్, అశోక్, భాను చందర్ పాల్గొన్నారు.
