
ఎలక్ట్రిక్ కార్లు ఈ–ట్రాన్ జీటీ, ఆర్‌ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడల్స్‌ను ఆడి బుధవారం లాంచ్ చేసింది. వీటి ధరలు వరసగా రూ. 1.79 కోట్లు, రూ. 2.04 కోట్లు (ఎక్స్‌షోరూమ్). ఈ–ట్రాన్ జీటీలో 390 కిలో వాట్స్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 401–481 కిమీ వెళ్లొచ్చు. అదేవిధంగా ఆర్‌ఎస్ ఈ–ట్రాన్ జీటీలో 475 కి.వా. బ్యాటరీ ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌కు 388–500 కి.మీ వెళుతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లలో 5–80 శాతం ఛార్జింగ్ సుమారు 22 నిమిషాల్లో పూర్తవుతుందని ఆడి పేర్కొంది.