కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయం : ఆవుల రాజిరెడ్డి

కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయం : ఆవుల రాజిరెడ్డి

కొల్చారం, కౌడిపల్లి,  వెలుగు:  రాష్ట్రంలో  కాంగ్రెస్​ గాలి వీస్తోందని, మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని నర్సాపూర్ అసెంబ్లీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని  దుంపలకుంట చౌరస్తా, ఎనగండ్ల, వై.మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్, రంగంపేట్ గ్రామాల్లో  ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూంల పేరిట ప్రజలను మోసం చేసిందని, ఏ గ్రామానికి వెళ్లినా ఉండటానికి సరైన ఇల్లు లేక అనేక మంది పేదలు పూరి గుడిసెలపై కవర్లు కప్పుకొని నివసిస్తున్నారన్నారు. 

రుణమాఫీ విషయంలో కేసీఆర్​ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. సునీత లక్ష్మారెడ్డి స్వార్థం కోసం కాంగ్రెస్ ను విడిచి బీఆర్ఎస్ లోచేరినప్పుడు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలవడంతోపాటు, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని గుర్తు చేశారు. కొందరు నాయకులు తనపై బీఆర్ఎస్  కోవర్ట్ అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

ALSO READ : మీ ఓటే మాకు అభయ హస్తం : గడ్డం వినోద్

బీఆర్ఎస్ పైన  ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం తథ్యమన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సాయిరెడ్డి సుహాసిని,  రెడ్డి శేఖర్ రెడ్డి,  ప్రవీణ్ రెడ్డి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రియాజ్ అలీ,మాదాపూర్ గ్రామ అధ్యక్షుడు అంజగౌడ్,  సంగాయిపేట మాజీ సర్పంచ్ బద్య నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.

కాంగ్రెస్ లో చేరిక

కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్లు నర్సింలు, యాదగిరి గౌడ్, శంకర్, నారాగౌడ్, సంతోష్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ మల్లేశ్ యాదవ్, బీజేపీ  అధ్యక్షుడు సురేశ్, ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ తోపాటు 200 మంది, సలాబత్​ పూర్​ పంచాయతీ బద్య తండాకు  చెందిన 20 మంది, పీర్ల తండాకు చెందిన 20 మంది, కుషన్ గడ్డ తండాకు చెందిన 15 మంది ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పోచయ్య, మాజీ ఎంపీపీ యాదగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింలు, భైరవ స్వామి ఉన్నారు.