యంగ్ డైరెక్టర్స్ తో బేబీ మూవీ ప్రొడ్యూసర్.. వరుసగా నాలుగు సినిమాలు

యంగ్ డైరెక్టర్స్ తో బేబీ మూవీ ప్రొడ్యూసర్.. వరుసగా నాలుగు సినిమాలు

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) జంటగా వచ్చిన బేబీ(Baby) మూవీకి యూత్ ఫిదా అయ్యారు. దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh) తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల క్లబ్ లో చేరి..ఈ ఇయర్ లో వచ్చిన క్లీన్ హిట్స్ లిస్టులోకి చేరిపోయింది. ఈ మూవీని తెరకెక్కించిన ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ (SKN)కు కాసుల వర్షం కురిపించింది.

ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌  వరుస సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. తన బ్యానర్ నుంచి రాబోయే చిత్రాలకు ఆల్రెడీ యంగ్ డైరెక్టర్స్ ను ఎంచుకుని..ఇంస్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేశారు. ఇందులో బేబీ మూవీని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ..త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. ఇక SKN షేర్ చేసిన ఫొటోస్ లో కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, రవి నంబూరి, సుమన్ పాతూరి లు ఉన్నారు. ప్రసెంట్ ఈ డైరెక్టర్స్ అంత స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో వీరి సినిమాలు అనౌన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

ప్రొడ్యూసర్ SKN..బేబీ మూవీ ఇచ్చిన సక్సెస్ తో  భారీ సినిమాలు నిర్మించకుండా..మంచి కాన్సెప్ట్ తో చిన్న సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యారు.బేబీ తరహాలో సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం మరోసారి సక్సెస్ అవ్వడం కన్ఫర్మ్. రానున్న రోజుల్లో తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వనున్నారు ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌.

ALSO READ:  రవితేజ సినిమాకు అన్యాయం.. లియోకు అంత అవసరమా?

ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ (SKN)..  

ప్రొడ్యూసర్ SKN కెరీర్ స్టార్టింగ్ లో స్టార్ అల్లు అర్జున్‌ కి పర్సనల్ పీఆర్‌ గా, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌ కి పీఆర్ గా చాలా కాలం పాటు వర్క్ చేశారు. దీంతో మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.