బాలకృష్ణతో NBK108 రివీల్ చేసిన అనిల్ రావిపూడి

బాలకృష్ణతో NBK108 రివీల్ చేసిన అనిల్ రావిపూడి

పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఓ తీపి కబురును చేశారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే దర్శకుడు గోపీచంద్ మలినేనితో NBK107 సినిమా తెరకెక్కుతుందని చెప్పడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఈ మధ్యే ఆ మూవీకి సంబంధించిన ఊరమాస్ లుక్ లో బాలకృష్ణ  కనిపిస్తుండడంపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే తాజాగా తన 108వ సినిమాను ప్రకటించారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనుకున్నారు. ఇటీవలే ఫన్ అండ్ ఎంటర్ టైనింగ్ నేపథ్యంలో ఎఫ్3 సినిమాతో  అభిమానుల్ని అలరించిన అనిల్ రావిపూడినే. ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ.. నేడు బాలయ్య బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా ఈ ప్రకటనను వెల్లడించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. NBK108 పేరుతో అనౌన్స్ చేసిన ఈ సినిమాపై ఇప్పటినుంచే బాలయ్య ఫ్యాన్స్.. నెక్స్ట్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీకి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు బర్త్ డే విషెస్ ను కూడా ఆయన తెలియజేశారు.