
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ సిటీలో భారీ వరదలు తట్టుకోవడానికి అనువుగా స్ట్రాం వాటర్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం బల్దియా హెడ్ ఆఫీస్లో శుభ్ కన్సల్టెన్సీ వారి ద్వారా స్ట్రాం వాటర్ డ్రైన్ ప్రాథమిక డిజైన్, ఎస్టిమేట్ పై నిర్వహించిన వీడియో ప్రదర్శన కార్యక్రమంలో మేయర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఏం హెచ్ వో రాజారెడ్డి, ఇన్చార్జి ఎస్ఈ మహేందర్, ఎంహెచ్ వో రాజేష్, ఈఈ తదితరులు పాల్గొన్నారు.