పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి

బెల్లంపల్లి, వెలుగు: పోలీస్​అమరుల త్యాగాలు మరువలేనివని బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్​అన్నారు. పోలీస్​అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలీ భవన్​లో సబ్​డివిజన్​స్థాయి మెగా బ్లడ్​డొనేషన్​క్యాంప్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, యువకులు, సామాజిక కార్యకర్తలు రక్తదానం చేశారు. రామగుండం కమిషనరేట్​లోనే అత్యధికంగా 246 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. బెల్లంపల్లి వన్​టౌన్, తాండూరు, రూరల్, మందమర్రి సీఐలు శ్రీనివాసరావు, దేవయ్య, హనోక్, శశిధర్​రాజు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ కాసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ...

నేరడిగొండ , వెలుగు: పోలీస్​అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఇచ్చోడ సీఐ బండారి రాజు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో స్థానికులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్సై సయ్యద్ ఇమ్రాన్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, వీడీసీ చైర్మన్ ఏలేటి రవీందర్ రెడ్డి, నాయకులు, పోలీస్​సిబ్బంది పాల్గొన్నారు .

ఇంద్రవెల్లి మండల కేంద్రంలో..

ఇంద్రవెల్లి, వెలుగు: పోలీస్​అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ 
నిర్వహించారు.  కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, స్థానిక యువకులు పాల్గొన్నారు.