పాకిస్తాన్ లో పుట్టిన అద్వానీని వరించిన భారత రత్న

పాకిస్తాన్ లో పుట్టిన అద్వానీని వరించిన భారత రత్న

రాజకీయ కురువృద్ధుడిగా చెప్పుకునే ఎల్ కే అద్వాణీ భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. నేడు కేంద్రం ప్రభుత్వం ఆయనకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న  ప్రకటించింది.  హిందుత్వ భావాలు, దేశభక్తి ఎక్కువగా ఉన్న ఈయన చిన్నతనంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చేరారు.  ఈయన పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వాణీ.  1927 నవంబర్ 8న ఇప్పటి పాకిస్తాన్ లోని కరాచీలో సింధీ హిందూ కుటుంబంలో జన్మించారు.  కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో విద్యాభాస్యమైంది. పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో డీజీ నేషనల్ కాలేజీలో లా చదివారు. అఖండ భారత్ విభజన సమయంలో భారత దేశపై ఆయనకున్న అభిమానంతో 1947 సెప్టెంబర్ 12న అద్వాణీ భారత్ కు వచ్చి స్థిరపడ్డారు. అంతకు ముందు కరాచీ ప్రాంతానికి కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 1965 ఫిబ్రవరి 25న అద్వాణీకి కమలతో వివాహమైంది.  వీరికి ఓ కూతురు, కుమారుడు.

రాజకీయాల్లో..

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్స్ తర్వాత ఎలక్షల్ లో జనతా పార్టీ విజయం సొంతం చేసుకుంది. 7సార్లు గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి లోక్ సభకు స్థానం నుంచి గెలిచారు. నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికైయారు. అటల్ బిహారీ వాజ్ పేయిని అద్వాణీ తన రాజకీయ గురువుగా భావించి.. ఆయన అనంతరం బీజేపీ పార్టీకి సారథ్యం వహించారు. 1970లో అద్వాణీ తొలిసారి ఢిల్లీ నుంచి రాజసభలో అడుగుపెట్టారు. 1977–79 మధ్యకాలంలో కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రిగా పనిచేశారు.  అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం 1990 సెప్టెంబర్ 25న అప్పటి బిహార్ ముఖ్య మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి రథయాత్రకు పిలుపునిచ్చారు. ఈ యాత్రతోనే ఆయనకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కారు.
2004లో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.  2009 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎల్ కె అద్వాణీని ప్రకటించినప్పటికి ఆ పార్టీ విజయం సాధించలేదు. 2014లోనూ ఆయన చివరిగా లోక్ సభకు గాంధీనగర్ నుంచి ఎన్నికైయారు.  75ఏళ్లు పెబడిన వారు బీజీపీ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయకూడదనే రూల్ ఉంది. ఈ రూల్ కారణంగా అద్వాణీ యాక్టీవ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు.

Beta feature