- బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్రెడ్డి
బోధన్, వెలుగు : బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బోధన్, సాలూరా మండలాల్లో విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. బోధన్ మండలంలోని కల్టుర్కి గ్రామంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ప్రతి మండల కేంద్రాల్లో రహదారులు నిర్మిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

