జూనియర్ కాలేజీ కాలేజీ కోసం బీజేవైఎం పాదయాత్ర

జూనియర్ కాలేజీ కాలేజీ కోసం బీజేవైఎం పాదయాత్ర

నాగర్ కర్నూల్ టౌన్ : పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలోపెద్ద కొత్తపల్లి మండల కేంద్రం నుంచి నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 20 ఏళ్లుగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సుధాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఏటా 700 మందికిపైగా విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుంటున్నారని అన్నారు. జూనియర్ కళాశాల అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక చాలామంది చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.