V6 News

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా ? ప్రతిరోజూ ఈ పండు తింటే చాలు !

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా ? ప్రతిరోజూ ఈ పండు తింటే చాలు !

ప్రస్తుత కాలంలో పట్టణ ప్రాంతాల్లోని  ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ వ్యాధి సోకే అవకాశం ఉంది. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఈ వ్యాధి, ముదిరితేనే తప్ప ప్రాణాంతకమని ఎవరూ గుర్తించలేరు. అయితే, కొత్తగా జరిగిన ఒక అధ్యయనం ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. ప్రతిరోజూ 'నవెలీనా' రకం నారింజ పండ్లను తినడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రభావం చాలా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

అధ్యయనంలో తేలిందేమిటి 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సుమారు 60 మంది బాధితులపై 4 వారాల పాటు ఈ పరిశోధన చేసింది. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టి, ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ 400 గ్రాముల నారింజ పండ్లను ఇచ్చారు. ఫలితంగా, నారింజ పండ్లు తిన్నవారిలో కాలేయ వాపు తగ్గడమే కాకుండా, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లోకి వచ్చినట్లు గుర్తించారు.

ఎందుకు నారింజ పండ్లే తినాలి 
నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణజాలం చుట్టూ కొవ్వు చేరకుండా రక్షిస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, నారింజను జ్యూస్ రూపంలో కాకుండా, పండును నేరుగా ముక్కలుగా తినాలి. అప్పుడే దానిలో ఉండే పీచు పదార్థం పూర్తిస్థాయిలో అందుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్త 
షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా నారింజ పండ్లు తినవచ్చు, కానీ మోతాదు విషయంలో జాగ్రత్త అవసరం. నారింజలోని సహజ చక్కెర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి, వారు  డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకు సరైన మోతాదును నిర్ణయించుకోవడం మంచిది.

ALSO READ :  ఫ్రిజ్ క్లీనింగ్ ను లైట్ తీసుకుంటున్నారా.. 

నారింజ పండ్లు కేవలం కాలేయ ఆరోగ్యానికి మాత్రమే తోడ్పడతాయి. ఇది వ్యాయామానికో లేదా డాక్టర్ ఇచ్చే మందులకో ప్రత్యామ్నాయం కాదు. మంచి జీవనశైలి, శారీరక శ్రమతో పాటు ఈ ఆహారపు అలవాట్లను పాటిస్తేనే ఫ్యాటీ లివర్ నుండి ఉపశమనం పొందవచ్చు.