
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లాలో తాళం వేసిన ఇండ్లల్లో, బైక్ డిక్కీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను చందంపేట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి రూ.12 లక్షల విలువైన 115.50 గ్రాముల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.25 వేల నగదు, సెల్‌ఫోన్‌లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. చందంపేట మండలం పోలేపల్లి ఎక్స్‌రోడ్ వద్ద వాహన తనిఖీల సమయంలో బైక్‌పై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరిని వేలిముద్రల ద్వారా గుర్తించామన్నారు.
వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసపోగు శాంసన్ (పల్నాడు), కంకరకొండ కృష్ణ కిషోర్ (బాపట్ల) అని తెలిపారు. వీరిద్దరూ జైల్లో పరిచయమై విడుదలయ్యాక కలిసి చోరీలు చేసేవారని విచారణలో వెల్లడైంది. నల్గొండ వన్‌టౌన్ పోలీసులు మరో నిందితుడు కాకినాడకు చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్ ను అరెస్ట్ చేశారు. అతడు బంగారం అమ్మేందుకు షాప్‌కి వచ్చిన సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు.