వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఇలా చేసుకోవచ్చు..

 వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఇలా చేసుకోవచ్చు..

మెటా వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ మే 16న వాట్సాప్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. వినియోగదారుల సన్నిహిత సంభాషణలను, చాట్ ను ప్రైవేట్‌ గా ఉంచేందుకు 'చాట్ లాక్' అనే కొత్త వాట్సాప్ ఫీచర్‌ను ప్రకటించారు.

  • మెటా ప్రకారం, ఈ ఫీచర్ మీ అత్యంత సన్నిహిత సంభాషణలను పాస్‌వర్డ్‌తో ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. వాటిని ఓ ప్రత్యేక ఫోల్డర్‌లో భద్రపరుస్తుంది. ఎవరైనా మీకు మెసేజ్ పంపినప్పుడు, మీరు ఆ చాట్ ను లాక్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతే కాకుండా పంపినవారి పేరు. మెసేజ్ లోని కంటెంట్ కూడా ప్రైవేట్ గా ఉంచబడుతుంది.
  • వాట్సాప్ చాట్ 'లాక్' చేసినప్పుడు, ఆ సంభాషణను యూజర్ ఇన్‌బాక్స్ నుంచి తీసివేయబడుతుంది. అది ఓ ఓన్ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. నోటిఫికేషన్‌లు వచ్చినపుడు కూడా ఇది ఆ చాట్‌లోని విషయాలను దాచిపెడుతుంది.
  • యూజర్స్ ఒకరి నుంచి ఒకరికి లేదా గ్రూపు పేరును నొక్కి, లాక్ సెలక్షన్ ను ఎంచుకోవడం ద్వారా చాట్‌ను లాక్ చేయవచ్చు. ఈ కొత్త యాప్ అప్‌డేట్‌ ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో అందుబాటులో ఉంటుంది.
  • లాక్ చేయబడిన చాట్‌ను యాక్సెస్ చేయడానికి, యూజర్ తన మొబైల్ పాస్‌వర్డ్‌ను లేదా వేలిముద్ర (థంబ్ ) వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ ను ఉపయోగించవచ్చు. మెటా ప్రకారం, చాట్‌ లాక్ ఎక్కువగా ఫోన్‌లను తమ కుటుంబ సభ్యులతో కలిసి వాడుకునే సందర్భంలో యూజర్స్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • రాబోయే నెలల్లో, చాట్ లాక్‌కి మరిన్ని ఆప్షన్స్ రానున్నాయి. తద్వారా ఒక వ్యక్తి ప్రైవేట్ కన్వర్జేషన్ ను అన్‌లాక్ చేయడానికి, వారి ఫోన్ పాస్‌వర్డ్‌కు భిన్నమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించవచ్చు.