తల్లి కొడుతున్నదని..ఐదో అంతస్తు నుంచి దూకిన బాలుడు

తల్లి కొడుతున్నదని..ఐదో అంతస్తు నుంచి దూకిన బాలుడు

బీజింగ్ : తల్లి దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఆ ఆరేళ్ల కొడుకు ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంలో ఎముకలు విరిగిపోయాయి. స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గత నెల 25న ఈస్టర్న్ చైనాలోని అన్హుయి  ప్రావిన్స్ లో ఈ  హృదయ విదారక ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాలుడిని కొట్టవద్దని ఎంత చెప్పినా ఆ తల్లి వినలేదని పొరుగువారు తెలిపారు. కొడుకును ఆమె కొడుతున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసి చైనా సోషల్  మీడియా వీబోలో పోస్టు చేశారు. కోటి మంది ఆ వీడియో చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పిల్లలను రక్షించేందుకు మరిన్ని కఠిన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని కామెంట్లు చేశారు. కాగా, బాలుడు బయట ఆడుకొంటుండగా కింద పడతాడనే భయంతోనే అతని తల్లి కట్టె తీసుకొని వారించిందని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల వాదనను ఎవరూ నమ్మలేదు.