ములుగు, తొర్రూరు, వెలుగు : సీఎం కప్ పోటీలు క్రీడాకారులకు వరమని, ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గురువారం ములుగులో సీఎం కప్ రెండో ఎడిషన్ టార్చ్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు టార్చ్ ర్యాలీలు కొనసాగుతాయన్నారు. శాట్స్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్నుంచి తొర్రూరు మెయిన్ రోడ్ మీదగా బస్టాండ్ వరకు
ర్యాలీని నిర్వహించారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్
హన్మకొండ సిటీ : గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండీ అజిజ్ ఖాన్ అన్నారు. సీఎం కప్ –2025 రెండో ఎడిషన్ టార్చ్ ర్యాలీ గురువారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఎదుట ఆయన ప్రారంభించారు.
