చంద్రబాబుది బోగస్​ రిపోర్ట్​... నాది ప్రోగ్రస్​ రిపోర్ట్​: సీఎం జగన్

చంద్రబాబుది బోగస్​ రిపోర్ట్​... నాది ప్రోగ్రస్​ రిపోర్ట్​: సీఎం జగన్

​జాబు రావాలంటే ఫ్యాన్​ రావాలా... తుప్పు పట్టిన సైకిల్​ రావాలా అని సీఎం జగన్​ పిడుగురాళ్ల సభలో ప్రశ్నించారు.  బాబుది బోగస్​ రిపోర్టు... తనది ప్రోగ్రెస్​ రిపోర్టు అని జగన్​ అన్నారు. పిడుగురాళ్లలో  సిద్దం సభ కోటప్పకొండ తిరునాళ్ల మాదిరిగా ఉందని  సీఎం జగన్ అన్నారు. జిత్తులమారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయన్నారు.  దుష్ట కూటమి నుంచి కాపాడేందుకు అందరూ సిద్దమేనా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు 58 నెలల సంక్షేమానికి అద్దం పడతాయన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించామన్నారు.

ఈ ఎ న్నికలు జగన్​ కు.... చంద్రబాబు కు మధ్య జరిగే ఎన్నికలు కావని సీఎం జగన్​ పిడుగురాళ్లసభలో అన్నారు.  ప్రజలకు .. చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు.  చంద్రబాబు ఎన్నికలకు ముందు గంగ.. ఆతరువాత చంద్రముఖి అని ఎద్దేవా చేశారు. 

జగన్ కు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగుగాయి. కాని చంద్రబాబుకు ఓటేస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి.  ఓటు మీదే మీభవిష్యత్తు ఆధారపడి ఉందని జగన్​ అన్నారు. ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలన్నారు.  చంద్రబాబు మూడు సార్లు అధికారంలోకి వచ్చి,... 14 ఏళ్లు సీఎంగా చేసిన హయాంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు.  జాబు రావాలంటే... బాబు రావాలని భ్రమలు కల్పిస్తారంటూ.. గాడిదను గుర్రంలా నమ్మించే ప్రయత్నం  చేస్తారన్నారు.

వైసీపీ హయాంలో కేవలం సచివాలయాల్లోనే  లక్షా 35 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.  గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావంటూ... వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు.   వైసీపీ హయాంలో ఆస్పత్రుల రూపు రేఖలు మార్చామన్నారు.  58 నెలల్లో వైద్య రంగంలో 54 వేల పోస్టులను భర్తీ చేశామన్నారు.  80 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చామన్నారు.  వైసీపీ అధికారంలోకి రాగానే 2 లక్షల 35వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 

 చంద్రబాబుకు రైతులపై ప్రేమ ఉందా అని ప్రశ్నించారు,  టీడీపీ హయాంలో రైతుకు చంద్రబాడు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచంలో  వ్యవసాయం దండగ అన్న చంద్రబబు  సీఎంగా ఉన్న సమయంలో అన్నారని జగన్​ అన్నారు. రైతు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేసి... రైతులకు ఇన్​ పుట్​ సబ్సిడీ.. సున్నా వడ్డీ  2014 నుంచి 2019 వరకు ఇవ్వలేదన్నారు.  బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని మోసం చేశారన్నారు,  

వైసీపీ హయాంలో ఇప్పటి వరకు రూ. 67,500  ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చామన్నారు.  రైతులకు  పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్​ ను అందించామన్నారు. రైతులకు మ్యానిఫెస్టోలో   చెప్పిన దానికంటే ఎక్కువే చేశామన్నారు.  పంట నష్టం జరిగితే .. పరిహారాన్ని వెంటనే అందించామన్నారు.  చంద్రబాబు ఎత్తేసిన సున్నా వడ్డీ రుణాన్ని అమలు చేశామన్నారు.  35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించామన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి.. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట కొనుగోలు వరకు రైతుకు అండగా ఉన్నామన్నారు.  ఏ సీజన్​ లో ఇన్​ పుట్​ సబ్సిడీని ఆ సీజన్​ లో అందించాన్నారు.  లంచాలు, వివక్షత, సంక్షేమ పథకాలు  అందించి.. గ్రామాలను తీర్చిదిద్దామన్నారు. వైసీపీ ప్రభుత్వం దేశానికే చాటిచెప్పిందన్నారు. 

మొన్నటివరకు వాలంటీర్ల వ్యవస్థను తప్పుపట్టిన చంద్రబాబు ... ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించారని సీఎం జగన్​ అన్నారు.  ఇలాగైనా జగన్​ పాలన బాగుందని చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు.  వాలంటీర్ల వ్యవస్థను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి... ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మారు.. వాలంటీర్లను జగన్​ కు అధికారిక పెగాసిస్​ వ్యవస్థ అని పవన్​ ట్వీట్​ చేశారు.. వాలంటీర్లు మనుషులను అక్రమ రవాణా చేస్తున్నారని పవన్​ అన్నారని సీఎం జగన్​ పిడుగురాళ్ల సభలో అన్నారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారు.  చంద్రబాబు వస్తే వాలంటీర్లు పోయి.. జన్మభూమి కమిటీలు వస్తాయన్నారు.  నిమ్మగడ్డ రమేష్​ తో ఈసీకి ఫిర్యాదు చేయించి.. అవ్వా.. తాతలు ఇబ్బంది పడేలా  చేశారన్నారు.

2014లో ఈ మూడు పార్టీలే కూటమిగా ఏర్పడి.. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  ఇంటింటికీ ఉద్యోగం.. నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని సీఎం జగన్​ అన్నారు.  ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పధకం కింద రూ. 25 వేలు ఇస్తామని ముఖ్యమైన హామీలంటూ ఇంటింటికి కరపత్రాలు పంపించారన్నారు. అర్హులైన వారందరికి 3 సెంట్లు ఇస్తామన్నారు.. కనీసం ఒక్క సెంటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.