టోకెన్లు ఇవ్వండి నగదు తీసుకోండి.. బీఆర్ఎస్ సభలకు హాజరయ్యే జనానికి డబ్బు పంపిణీ

టోకెన్లు ఇవ్వండి నగదు తీసుకోండి.. బీఆర్ఎస్ సభలకు హాజరయ్యే జనానికి డబ్బు పంపిణీ

ఎన్నికల సీజన్..ప్రచారం ఊపందుకుంది. స్వయంగా బీఆర్ఎస్ అధినేతే  ప్రచార సభల్లో పాల్గొంటుండు. మరి సభకు కేసీఆర్ సారొస్తే..సభ జనంతో నిండాలి. సభకు సారు వచ్చే సమయానికి జనంతో కళకళలాడాలి. దీంతో కిందిస్థాయి బీఆర్ఎస్  నాయకులకు  జన సమీకరణ తలనొప్పిగా మారింది. ప్రజలను  సభలకు తీసుకురావాలంటే నానా తంటాలు పడుతున్నారు. రండి బాబూ రండి అంటూ పిలుస్తున్నారు. మనిషికి ఇంత అంటూ బేరం కుదుర్చుకుని తరలిస్తున్నారు. తాజాగా అక్టోబర్ 17వ తేదీన సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన జనానికి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 
ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 17వ తేదీన సీఎం కేసీఆర్ సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు లక్ష మందిని తరలించాలని అధిష్టానం నుంచి కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్లకు ఆదేశాలు అందాయి. దీంతో జనసమీకరణకు కింది స్థాయి అధికారులు నానా కష్టాలు పడ్డారు. సిరిసిల్ల సభకు వస్తే..మనిషికి ఇంత ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. ఎవరెవరు వస్తారో వారు సభ ముగిసిన తర్వాత డబ్బులు తీసుకోవాలని..అందుకు ముందే టోకెన్లు జారీ చేశారు. ఇక సభ ముగిసిన తర్వాత జనాలు బీఆర్ఎస్ నాయకులకు టోకెన్లు ఇవ్వగా..వారికి డబ్బులు పంపిణీ చేశారు.