రూల్స్ ప్రకారం లేఔట్ అనుమతులు ఇవ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

రూల్స్ ప్రకారం లేఔట్ అనుమతులు ఇవ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : పారదర్శకంగా నిబంధనలకు లోబడి లేఔట్ అనుమతులు జారీ చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాల్ లో గురువారం నిర్వహించిన లేఔట్ కమిటీ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి ఆయన మాట్లాడారు. పెండింగ్ ఉన్న లేఔట్ అనుమతులపై చర్చించారు.  లూ అవుట్​ కోసందరఖాస్తు చేసుకున్న స్థలాల్లో గతంలో ఏమైనా నీటి వనరులు ఉన్నాయా లాంటి అంశాలను పరిశీలించారు.

 లేఔట్ అనుమతులు మంజూరు చేసే సమయంలో నియమ, నిబంధనలు అనుసరించేలా చూడాలని కలెక్టర్​ సూచించారు. లేఔట్ కు అప్రోచ్ రోడ్డు, అంతర్గత రోడ్లతోపాటుస్ట్రీట్ లైట్స్, సీవరేజి వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లలో అనుమతులు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేఔట్ లకు డ్రాఫ్ట్ అనుమతులు జారీ చేసిన తర్వాత విద్యుత్ స్తంభాల తరలింపు కోసం ఎన్ పీడీసీఎల్​డిమాండ్ నోటీస్ అందించాలని,  వారం రోజుల వ్యవధిలోగా చెల్లింపులు పూర్తి చేయాలని, లేకపోతే డ్రాఫ్ట్ అనుమతులు ఉప సంహరించాలని తెలిపారు.  ఖమ్మం జిల్లాలో ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి డీఎల్​సీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, సుడా సీపీవో, పంచాయతీ రాజ్ ఈఈ మహేశ్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్లు సైదులు, రాంప్రసాద్, ఇరిగేషన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సూపర్​వైజర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఆస్పత్రుల తనిఖీ 

కూసుమంచి  : కూసుమంచి మండలం కేంద్రంలోని  ఆయుర్వేద, యునానీ, హోమియో, పీహెచ్​సీలను కలెక్టర్ అనుదీప్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కాన్పుల గదిలో కావాల్సిన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరాతీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. పీహెచ్​సీ చుట్టుపక్కల ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సీజనల్​వ్యాధులపై అధికారులు, ప్రజలు అలర్ట్​గా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్డార్ రవికుమార్, డాక్టర్లు సాయికుమార్, లక్ష్మిలోహిత, 
సిబ్బంది ఉన్నారు.