దూది వెంకటాపురంలో కలెక్టర్ పల్లెనిద్ర

దూది వెంకటాపురంలో కలెక్టర్ పల్లెనిద్ర

రాజపేట, వెలుగు: మండలంలోని దూది వెంకటాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. లబ్ధిదారులందరికీ  రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం వంటి పథకాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 

ఉదయం, సాయంత్రం బస్ సౌకర్యం లేదని గ్రామస్తులు కలెక్టర్‌‌ కు తెలిపారు.  గుట్ట డిపో డీఎంకి ఫోన్ చేసి బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వెటర్నరీ సబ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజ, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా పంచాయతీ అధికారి సునంద, అధికారులు పాల్గొన్నారు.