ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఇలా త్రిపాఠి

ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం గుర్రంపోడు ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ముందుగా లబ్ధిదారులు బేస్మెంట్ వేసుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఇండ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక  స్థోమత లేని వారిని గుర్తించి, వారికి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేయాలని చెప్పారు.

 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్కడైనా ఇసుక, లేబర్ సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఎంపీడీవోకు సూచించారు. మండలానికి మంజూరైన ఇండ్ల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డీవో రమణారెడ్డిని ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్ కుమార్, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రెండు నెలల్లో భవన నిర్మాణం కంప్లీట్..

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న నూతన భవనాన్ని రెండు నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కాంట్రాక్టర్ ను ఆదేశించారు. సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్ ను పరిశీలించి ఆస్పత్రికి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు అందిస్తున్న సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.