బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలి : కలెక్టర్ ​మనుచౌదరి

బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలి : కలెక్టర్ ​మనుచౌదరి

సిద్దిపేట రూరల్: బడి ఈడు పిల్లలందరిని తప్పకుండా బడిలో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా గత సంవత్సరం స్టూడెంట్స్​అసలే చేరని స్కూళ్లు, మూతబడిన ప్రభుత్వ బడులు, అత్యధికంగా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న స్టూడెంట్స్​ఉన్న ప్రాంతాల్లో విద్యాశాఖ అధికారులు సమావేశాలు నిర్వహించాలన్నారు. కారణాలు కనుక్కొని పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. వారి డిమాండ్లను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

 ఇందిరా సౌరగిరి కార్యక్రమం ద్వారా గిరిజన లబ్ధిదారుల భూముల అభివృద్ధి, సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వన మహోత్సవం ద్వారా ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్నమొక్కలు నాటేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి జోజి, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీపీవో దేవకీదేవి, డీఈవో  శ్రీనివాస్ రెడ్డి, డీటీడీవో అఖిలేశ్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

 ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల నమోదు పెంచుదాం

సంగారెడ్డి టౌన్: ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల నమోదు పెంచుటకు  బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు.  సోమవారం సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి జడ్పీ హెచ్ఎస్ లో డీఈవో వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘంగా ఉపాధ్యాయుల ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం కోసం ప్రచార యాత్ర నిర్వహించడం అభినందనీయమ న్నారు. కార్యక్రమంలో జిల్లా న్యూడల్​అధికారి లింబాజీ, ఎంఈవో విద్యాసాగర్, యూటీఎఫ్ నాయకులు జ్ఞాన మంజరి, అశోక్, సాయిలు, శ్రీనివాసరావు, అరుణ శ్రీ, సాయి తేజ, చంద్ర రాథోడ్ ఉన్నారు.