
నెక్కొండ/ పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ, పర్వతగిరి తహసీల్దార్ ఆఫీసులను కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో నెక్కొండ డీటీ రవి డ్యూటీలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి మెమో జారీ చేయాలని తహసీల్దార్ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈనెల15లోపు భూభారతి అప్లికేషన్లు పూర్తిచేయాలని, పెండింగ్‌లేకుండా డిస్పోజ్చేయాలన్నారు. ఆమెవెంట ఆర్డీవోలు ఉమారాణి, సత్యపాల్‌రెడ్డి, డీఏవో పణికుమార్, డీటీటీవో సౌజన్య. తహసీల్దార్లు రాజ్‌కుమార్, వెంకటస్వామి తదితరులున్నారు.