జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు కావాల్సినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ అధికారులు బాగా పని చేశారని కలెక్టర్ అభినందించారు. 

ఎవరైనా యూరియా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఉద్యాన దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఉద్యానవన అధికారి నాగయ్య, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

లక్ష్య సాధన కోసం కృషి చేయాలి.. 

తుంగతుర్తి, వెలుగు : విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. నూతనకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్​లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.