చిన్నచింతకుంట, వెలుగు: దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ విజయేందిరబోయి పరిశీలించారు. ఆర్వో, అసిస్టెంట్ ఆర్వోలకు పలు సూచనలు చేశారు. అనంతరం యూపీఎస్‌లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్ ను సందర్శించి, ఓటర్లకు కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి, నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లుకు పంపించాలని ఆదేశించారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు..
మహబూబ్ నగర్ కలెక్టరేట్: వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. కలెక్టరేట్ లో వడ్ల కొనుగోళ్లపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశ ఉన్న దృష్ట్యా వడ్లు తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోళ్లను స్పీడప్ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, డీఎస్ వో గంప శ్రీనివాస్, సివిల్ సప్లై డీఎం రవి నాయక్, డీఏవో వెంకటేశ్, జిల్లా సహకార అధికారి కృష్ణ, డీఆర్డీవో నర్సింహులు, మార్కెటింగ్ ఆఫీసర్ బాలామణి పాల్గొన్నారు.
