ఆర్మూర్, వెలుగు : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఆదివారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గం పరిధిలోని పంచాయతీరాజ్, రోడ్లు, వంతెనల నిర్మాణాలు, రిపేర్ల కోసం రూ.15 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
నియోజకవర్గంలో కావాల్సిన రోడ్లు, వంతెనల కోసం తయారు చేసిన ప్రతిపాదనల పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చినట్లు వినయ్ కుమార్రెడ్డి తెలిపారు.
