V6 News

గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సోనియాగాంధీ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే

గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సోనియాగాంధీ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే

కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత  సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ లీడర్లు ఘనంగా నిర్వహించారు. సిటీలోని ఇందిరా చౌక్ వద్ద డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో కలిసి కట్ చేశారు. కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాచౌక్ వద్ద రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

జగిత్యాల రూరల్/కోరుట్ల/రాయికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. కోరుట్లలోని  జువ్వాడి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో  సోనియాగాంధీ బర్త్​ డే నిర్వహించారు.​ ఈ సందర్భంగా కేక్ కట్​ చేసి పంపిణీ చేశారు. రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.