అక్రమంగా కట్టుకున్న ఇండ్లను ఖాళీ చేయాలి

అక్రమంగా కట్టుకున్న ఇండ్లను ఖాళీ చేయాలి
  • 24 మందికి ఆర్డర్లు జారీ చేసిన జడ్జి

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి శివారులో జాతీయ రహదారి-363 పక్కన సర్వే నంబర్ 3/పైకి (3/9)లోని 2.75 ఎకరాల భూమిలో అక్రమంగా ఇండ్లు కట్టుకున్న వారికి కోర్టు హెచ్చరిక జారీ చేసింది. 24 మందికి నోటీసులు ఇచ్చింది. బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి జె.ముకేశ్​ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. 24 మంది ఇండ్లు కట్టుకున్న భూమి అసలైన పట్టాదారులు రామరాజం, రామ సాలమ్మ, రామ కిష్టయ్య అని, 1986 నుంచే కేసు కోర్టులో ఉన్నదని జడ్జి నోటీసుల్లో తెలిపారు. 

మూడు రోజుల్లో ఇండ్లను ఖాళీ చేయాలని పేర్కొన్నారు.   ఖాళీ చేయకపోతే ఏసీపీ, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో బలవం తంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. పంచాయతీ సిబ్బంది ఇప్పటికే అక్రమ నిర్మాణాల వద్ద నోటీసులు అతికించారు. ఈ వ్యవహారం బెల్లంపల్లిలో చర్చనీయాంశంగా మారింది.