ప్రధాని దిష్టిబొమ్మ దహనం

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

మహబూబాబాద్, వెలుగు: బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తుందని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోసానికి పాల్పడుతున్నారని శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి ఎన్నికలను ప్రభావితం చేస్తుందని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.