కుక్కలు, కోతుల నుంచి పిల్లల్ని కాపాడండి : మంద సంపత్

కుక్కలు, కోతుల నుంచి పిల్లల్ని కాపాడండి : మంద సంపత్

హనుమకొండ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో కుక్కలు, కోతుల నుంచి చిన్నపిల్లల్ని కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మంద సంపత్ డిమాండ్ చేశారు. హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద సోమవారం సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ నగరంలో కుక్కలు, కోతుల దాడిలో ఎంతోమంది గాయపడుతున్నారని, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారన్నారు.

 వీటి సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు విఫలమవుతున్నారని మండిపడ్డారు. వెంటనే కుక్కలు, కోతుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దూడపాక రాజేందర్, ఇస్లావత్ రవీందర్, ఆలకుంట మల్లయ్య, అయిత మారుతి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.