న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ.773.68 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.658.71 కోట్ల ప్రాఫిట్‌తో పోలిస్తే ఇది 17.45 శాతం ఎక్కువ. క్లాత్స్, జనరల్ మర్చండైజ్ సేల్స్ పెరగడంతో కంపెనీ ప్రాఫిట్ పెరిగింది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆపరేటింగ్ రెవెన్యూ రూ.11,865.44 కోట్ల నుంచి 18.57 శాతం వృద్ధి చెంది రూ.14.069 కోట్లకు చేరుకుంది. కంపెనీ మొత్తం ఖర్చులు 18.62 శాతం పెరిగి రూ.13,056.61 కోట్లకు పెరిగాయి. మర్చండైజ్, క్లాత్స్ సేల్స్ పెరగడంతో జూన్ క్వార్టర్‌లో కంపెనీ మార్జిన్స్ మెరుగుపడ్డాయని అవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈఓ నెవైల్ నొరొన్హో అన్నారు. జూన్ క్వార్టర్‌లో ఆరు కొత్త స్టోర్లను ఓపెన్ చేశామని, దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 371 కి పెరిగిందని తెలిపారు.