ఢిల్లీ స్టేడియంలో ఏడు పెంకులాట.. జడేజా బెదిరింపులు..వార్నర్ బ్యాట్ తిప్పుడు.. వైరల్

 ఢిల్లీ స్టేడియంలో ఏడు పెంకులాట.. జడేజా బెదిరింపులు..వార్నర్ బ్యాట్ తిప్పుడు.. వైరల్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ వార్నర్ ...రహానే, జడేజా ఏడు పెంకులాట ఆడుకున్నారు. అయితే పెంకులు లేవు కానీ..వికెట్లనే పెంకులుగా మార్చకున్నట్లు ఆడారు. అవును..కింది వీడియోను చూస్తే నిజమో కాదు మీకే తెలుస్తుంది...ప్రస్తుతం వార్నర్, జడేజా, రహానేల బంతి ఆట సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

జడేజా బెదిరింపు..వార్నర్ చిందులు..

చెన్నై సూపర్ కింగ్స్,  ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర  ఘటన జరిగింది. ఈ సరదా ఘటన ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది.  దీపక్ చాహర్ వేసిన 5వ ఓవర్‌లో  మూడో బంతిని  వార్నర్ కవర్ దిశగా ఆడాడు. అయితే సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో బంతిని అందుకున్న మొయిన్ అలీ రనౌట్ కోసం వికెట్లకు  త్రో వేశాడు. వార్నర్ డైవ్ చేశాడు. ఈ బంతి అవతలి వైపు ఉన్న రహానే దగ్గరకు చేరింది.  దీంతో వార్నర్ రన్ తీసేందుకు రహానేను బెదిరించాడు. దీంతో రహానే మరోసారి బంతిని వికెట్లకు త్రో చేశాడు. మిస్ అయి బంతి జడేజా చేతుల్లో పడింది. మరోసారి రన్ కోసం పరిగెత్తేందుకు జడేజాను వార్నర్ బెదిరించాడు.  రనౌట్ చేస్తా అంటూ జడేజా బంతితో బెదిరించగా.... చేయి అన్నట్లు చిందులేసిన వార్నర్..జడేజాలో  బ్యాట్‌ను కత్తిలా తిప్పాడు. దాంతో జడేజాతో పాటు..ఇతర ఆటగాళ్లు నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

ప్లేఆఫ్ కు చెన్నై

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు  చేసింది. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 ) అర్థసెంచరీలు సాధించారు.  శివమ్ దుబే(9 బంతుల్లో 3 సిక్స్‌లతో 22), జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) చెలరేగి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ బౌలర్లలో  సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ పడగొట్టారు.  ఆ తర్వాత 224 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడిపోయింది.  డేవిడ్ వార్నర్ 86 పరుగులతో  ఒంటరిపోరాటం చేశాడు.