కర్ఫ్యూపై 45 నిమిషాల్లో నిర్ణయం చెప్పండి: సర్కార్ కు హైకోర్టు డెడ్ లైన్

కర్ఫ్యూపై 45 నిమిషాల్లో నిర్ణయం చెప్పండి: సర్కార్ కు హైకోర్టు డెడ్ లైన్

హైదరాబాద్: నైట్ కర్ఫ్యూపై తెలంగాణ సర్కార్ కు డెడ్ లైన్ విధించింది హైకోర్టు. 45 నిముషాల్లో ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని లేకపోతే తామే ఆదేశాలు ఇస్తామని తెలిపింది హైకోర్టు. అయితే నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు తెలిపారు ఏజీ. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న హైకోర్టు..24 గంటల సమయంలో కూడా ఇంకా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని సీరియస్ అయ్యింది. నైట్ కర్ఫ్యూ పై జీవో ఈరోజు తో ముగుస్తుందని మరీ రేపటి నుండి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మే1 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందన్న ఏజీ..ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు 45 నిముషాలు సమయం ఇస్తున్నామని .. ప్రభుత్వ నిర్ణయం తెలపాలని సర్కార్ ను ఆదేశించింది. పిటీషన్ పాస్ ఓవర్ చేస్తున్నట్లు తెలిపింది హైకోర్టు.