చెస్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌: నెపోమ్నియాచికి దీప్తాయన్ చెక్‌‌‌‌‌‌‌‌

చెస్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌: నెపోమ్నియాచికి దీప్తాయన్ చెక్‌‌‌‌‌‌‌‌

పనాజీ:  సొంతగడ్డపై చెస్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌మాస్టర్ దీప్తాయన్ ఘోష్ సంచలనం సృష్టించాడు.  మాజీ వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ చాలెంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,   రష్యా స్టార్  ఇయాన్ నెపోమ్నియాచిని ఓడించాడు. బుధవారం (నవంబర్ 05) జరిగిన రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో నల్లపావులతో ఆడిన   దీప్తాయన్  అద్భుత విజయం సాధించాడు. 

దాంతో ఇయాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు తెలంగాణ జీఎం ఎరిగైసి అర్జున్  బల్గేరియాకు చెందిన మార్టిన్ పెట్రోవ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లాడు. ఆర్సెనియ్‌‌‌‌‌‌‌‌ నెస్టిరోవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా)పై గెలిచిన హరికృష్ణతో పాటు  వరల్డ్ చాంప్ డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌ కూడా ముందంజ వేశాడు.

 కానీ, వరల్డ్  జూనియర్ చాంపియన్ వి. ప్రణవ్ నార్వేకు చెందిన ఆర్యన్ తారితో  ఓడిపోయాడు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద,  విదిత్ సంతోష్,  ఎస్‌‌‌‌‌‌‌‌.ఎల్‌‌‌‌‌‌‌‌. నారాయణన్, ప్రణేష్, రౌనక్ సాధ్వాని తమ ప్రత్యర్థులతో గేమ్స్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్నారు.