విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే లెక్చరర్లు కృషి చేయాలని డీఐఈవో జాదవ్ గణేశ్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. లెక్చరర్లతో సమావేశమై మాట్లాడారు.

 సకాలంలో సిలబస్ పూర్తి చేసుకోవాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్​నిర్వహణపై సైన్స్ అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో లెక్చరర్లు శ్రీనివాస్, సువర్ణ, గణేశ్, తిరుపతి, దత్తు, సుధాకర్, నిలోఫర్ రాణా, విష్ణు, మల్లేశ్, ప్రకాశ్, సాయి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.